Breaking News

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన బిజెపి కూటమి సమావేశం

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల మండల జనసేన, బి.జె.పి కూటమి కార్యకర్తల సమావేశం గురువారం విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిచేందుకు అహర్నిశలు ప్రతి ఒక్కరు శ్రమించాలని బిజెపి నాయకులు ఆర్ముగం తెలిపారు. కూటమి అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు కలిగిన ఎడల సత్వరమే వారికి అన్ని రకాల అండదండలు అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని కంచికచర్ల మండల పరిధిలో ప్రతి గ్రామంలో జనసేన బిజెపి కూటమి జండా ఎగరాలని జనసేన నాయకులు తోట మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కామిశెట్టి వెంకటేశ్వరరావు, తోట ఓంకార్, తోట సాయి, చలమల శ్రీనివాస్, కంచికచర్ల జనసేన నాయకులు జెర్రిపోతుల చంటిబాబు, కంభంపాటి తిరుమలరావు,యర్రంశెట్టి కృష్ణ, నాయినిసతీష్,పెద్దినీడి హరి, పుప్పాల వేణు గోపాల్,నరసింహారావు, మాదాల రవీంద్ర, మరియు నందిగామ బిజెపి నాయకులు జంగం సునీల్ రాజు మాదాల రమేష్ మహిళా మోర్చా నాయకురాలు హరి శ్రీదేవి, కంచికచర్ల బిజెపి నాయకులు నన్నపనేని కృష్ణమూర్తి, బొల్లం హరి,షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *