తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద హవాలా డబ్బు కలకలం రేపింది. వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. ఓ కారులో భారీ మొత్తంలో నగదు గుర్తించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాలా డబ్బును సికింద్రాబాద్ నుంచి కోల్కతాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గోల్డ్ వ్యాపారి మహ్మద్ భాషాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. హవాలా రాకెట్ అసలు సూత్రదారులకోసం అరా తీస్తున్నారు.