Breaking News

అక్షర ఫౌండేషన్ ఆధ్వరంలో షేర్ మహమ్మద్ పేట గ్రామ ఆడపడుచులకు చీరల పంపిణీ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మండల పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ జంగాల రవీంద్రబాబు పిలుపుమేరకు అక్షర ఫౌండేషన్ ప్రతినిధి చైతన్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రపంచం అతలాకుతలమైన రైతులు మాత్రం గుండె నిబ్బరంతో కష్టించి పని చేసారు. నేడు మనం పట్టెడన్నం తినడానికి కారణమై ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తునందుకు అభినందనలు తెలియజేస్తూ షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాల ఆడపడుచులకు చిరు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు అక్షర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముగ్గుల పోటీలలో బతుకమ్మ సంబరాలలో దేవి నవరాత్రులలో పాల్గొంటున్నటువంటి సుమారు 50 మంది మహిళల ను ఘనంగా సన్మానించి సంప్రదాయబద్ధంగా చీరే సారె పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. అనంతరం ముగ్గుల పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతి మరియు అక్షర ఫౌండేషన్ మెమెంటో లు అందజేశారు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి అక్షర ఫౌండేషన్ ప్రతినిధి కాకన బోయిన చైతన్య తో పాటు జంగాల వెంకట నరసమ్మ ఆదినారాయణ సీతమ్మ బిక్షం పద్మ సుశీల తో పాటు అక్షర ఫౌండేషన్ బృందం పలువురు పెద్దలు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *