Breaking News

గోపినేనిపాలెం గ్రామంలో వై ఎస్ ఆర్ సి పి విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సర్పంచ్ బి. శ్రీనివాసరావు

తెలుగు తేజం, వత్సవాయి (ప్రతినిధి ) వత్సవాయి మండలంలోని గోపినేనిపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల విజయోత్సవ కార్యక్రమమునకు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా బి శ్రీనివాసరావు మాట్లాడుతూ నన్ను నమ్మి గెలిపించిన గోపినేనిపాలెం గ్రామ ప్రజలకు నా పదవీకాలం పూర్తయ్యే వరకు మీ సేవకై, మరియు గ్రామ అభివృద్ధికి నా జీవితం అంకితం చేస్తానని, నా గెలుపుకి కృషి చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని అన్నారు. గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్, శానిటేషన్, సిసి రోడ్లు, సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కే రాంబాబు, కె వెంకటేశ్వరరావు,యం రామారావు, బి బాలాజీ, షేక్ లాలు, షేక్ బాబు, డాక్టర్ మాణిక్యరావు, ముప్పిడి రాజు, కె వెంకటేశ్వర్లు, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *