Breaking News

ఘనంగా కంచికచర్ల పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమ సురేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ సురేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కంచికచర్ల పట్టణంలో ని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు బంకు సెంటర్ నందు చెవిటికల్లు సెంటర్ వసంత కాలనీ గొట్టుముక్కల రోడ్డు అంబేద్కర్ కాలనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.తదితర ప్రాంతాలలో ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు.పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వేమా సురేష్ బాబు కి ఆయన కార్యాలయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలో పలు ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వేమా సురేష్ బాబు మాట్లాడుతూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *