Breaking News

నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి : ఎంపీడీవో కె. శిల్ప

తెలుగు తేజం, కంచికచర్ల : తొలి విడత ఎన్నికలకు సంబంధించి కంచికచర్ల మండలం లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని ఎంపీడీవో కె. శిల్ప తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో తాసిల్దార్ రాజకుమారి తో కలిసి ఎంపీడీవో శిల్ప మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 16 గ్రామాలకు సంబంధించి 9 చోట్ల ఆయా పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్స్ శుక్రవారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈనెల 31 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. చెవిటికల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో చెవిటికల్లు కునికిన పాడు, మున్నలూరు గ్రామాలకు సంబంధించి నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గని అత్కూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గని ఆత్కూరు, కొత్తపేట, బత్తిన పాడు గ్రామ పంచాయతీల నామినేషన్లు, గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యాలయం లో గొట్టుముక్కల, పేర కలపాడు గ్రామాల నామినేషన్లు, కీసర గండేపల్లి గ్రామాల నామినేషన్లు కీసర గ్రామపంచాయతీ లోనూ, వేములపల్లి ఎస్ అమరవరం గ్రామాల నామినేషన్లు వేములపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లోనూ స్వీకరించడం జరుగుతుందన్నారు. మొగులూరు, పరిటాల, పెండ్యాల, కంచికచర్ల గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు ఆయా గ్రామ పంచాయతీలోనే స్వీకరించడం జరుగుతుంది తెలిపారు. మండలంలో మొత్తం 16 గ్రామాలకు సంబంధించి 51, 751 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో స్త్రీలు 26, 371 మంది, పురుషులు 25, 379 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ ఫారాలు , నామినేషన్ల తో పాటు జత చేయాల్సిన ధ్రువపత్రాలు ఆయా సెంటర్స్లో ఉదయం 10 గంటల నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ మరియు స్టేజ్ 1 ఆఫీసర్లు అందజేస్తారని తెలిపారు. రిజర్వేషన్ వివరాలు, ఓటర్ల జాబితాలు స్టేజ్ వన్ ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాల వద్ద డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. గ్రామ వాలంటీర్స్ ని ఎక్కడ ఎన్నికల విధులలో జోక్యం లేకుండా చూస్తున్నామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఆయా గ్రామాల్లో సైతం ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తాసిల్దార్ వి. రాజకుమారి తెలిపారు. సమావేశంలో ఈవోపీఆర్డీ కనకాల రవి కుమార్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *