Breaking News

బ్రెజిల్​లో ఘోర విమాన ప్రమాదం.. నలుగురు ఫుట్​బాల్ ఆటగాళ్ల మృతి

బ్రెజిల్‌లోని విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టొకాన్టిన్ రాష్ట్రంలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్​బాల్ ఆటగాళ్లు మరణించారు. బ్రెజిల్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్​బాల్ ఆటగాళ్లు మరణించారు. జట్టు అధ్యక్షుడితో పాటు పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్​లో ఈ ఘటన జరిగిందని టీం యాజమాన్యం వెల్లడించింది. విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది.

టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలమీద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. విలానోవా జట్టుతో గేమ్ ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. మృతులను లుకాస్ మెయిరా , లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమానం ఎలాంటిదన్న విషయంపై జట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *