Breaking News

శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల ఏర్పాట్లు అమ్మవారి పూజలు విషయాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో భ్రమరాంబలు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ దసరా లో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేశామని, పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తాం అన్నారు. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం అన్నారు. అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తాం అని చెప్పారు ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ,16 న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం,18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం లో 19 న శ్రీ మహాచండీ దేవి అలంకారంలో, 20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం) లో దర్శనమిస్తారని అదే రోజు మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నరు. 21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం లో 22 న శ్రీ దుర్గాదేవి అలంకారం, 23 న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవిఅలంకారం… మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిగునట్లు తెలిపారు.200 మంది ఇతర దేవాలయాల నుంచీ సిబ్బంది వస్తారన్నరు అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తారన్నరు కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుందన్నారు ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవుతాయన్నారు. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం అన్నారు. జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.పది ప్రసాదం కౌంటర్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తాం అన్నారు.బడ్జెట్ 7 కోట్లు కేటాయించామన్న ఆమె. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నాం అన్నారు. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *