బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు వెల్లడి..
జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఘనంగా సత్కరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాంకింగ్ లలో విజయవాడ వెస్ట్ మొదటి స్థానంలో నిలిచినందున సంఘ సభ్యులు సుజనా చౌదరి కి అభినందనలు తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సంఘ ప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సుజనా చౌదరి అంకిత భావం, నీతి నిబద్దత, అనుభవం ద్వారానే విజయవాడ పశ్చిమ నంబర్ 1 గా నిలిచిందని కొనియాడారు. నియోజకవర్గంలో అభివ్రుద్ది తో పాటు ఆ నియోజకవర్గంలో అధికంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు ఆశాజ్యోతిగా సుజనా చౌదరి నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షురాలు నూకాలమ్మ యాదవ్, ప్రధాన కార్యదర్శి పిళ్లా శ్రీనివాసరావు, క్రిష్ణా జిల్లా అద్యక్షుడు క్రిష్ణార్జునరావు, ప్రధాన కార్యదర్శి వీరంకి శ్రీనివాస్, కనిశెట్టి లక్ష్మణరావు, తోట శివరామ్ , గురునాధ బాబు, అమర్ బాబు,, తదితరులు పాల్గొన్నారు.