ఘనంగా వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

చల్లపల్లి వేడుకల్లో పాల్గొన్న యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు**చల్లపల్లి:*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చల్లపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య స్థానిక దళితవాడలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వికాస్ బాబు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాణాసంచా, టపాసులు పెంచి సంబరాలు చేశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వికాస్ బాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చల్లపల్లి జడ్పిటిసి సభ్యులు రాజులపాటి కళ్యాణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు రాజులపాటి శివప్రసాద్ (శివ), పార్టీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లూరి శామ్యూల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోపిదేవి ద్వారకానాథ్, చల్లపల్లి మండల కన్వీనర్ శీరం వెంకట సత్యనారాయణ(నాని), మండల యూత్ అధ్యక్షులు వెనిగళ్ళ తారక జగదీష్, మండల మహిళా అధ్యక్షురాలు బొందలపాటి లక్ష్మీ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మెరుగు రమేష్, మండల ఉపాధ్యక్షులు మోతుకూరి ఏడుకొండలు, కొమ్ము డేవిడ్, పాగోలు నాగ సీతారామరావు, లక్ష్మీపురం యూత్ అధ్యక్షుడు నజీర్, మాజేరు సర్పంచ్ కల్లేపల్లి లక్ష్మీప్రసాద్, మైనార్టీ నాయకులు జానీ, మహిళా నాయకులు పరుచూరి కుసుమ, పార్టీ నాయకులు కొల్లూరు ముద్దు కృష్ణ, కొల్లూరు కృష్ణ, కోట అంజిబాబు, ఎర్ర గంగాధరరావు, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, మంగళాపురం రమేష్, ముచ్చు భాను, జగన్, మట్టా సుబ్బయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *