
29/09/25 రాత్రి 7:30 నుంచి 30/09/25 ఉదయం 10:00 వరకు
అమరావతి, తెలుగుతేజం బ్యూరో రిపోర్టర్:
దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి మూల నక్షత్రం రోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి రావడం వల్ల విజయవాడలో కొన్ని ట్రాఫిక్ డైవర్షన్‌లు అమలు చేయబడ్డాయి.
డైవర్షన్ ప్రాంతాలు1. పున్నమి ఘాట్ ఎంట్రెన్స్ (కుమ్మరిపాలెం సెంటర్)2. తాడేపల్లి చెక్పోస్ట్3. ఆర్టీసీ ఇన్ గేట్, కనకదుర్గ ఫ్లైఓవర్ ఎంట్రాన్స్4. గద్ద బొమ్మ సెంటర్ ఈ ప్రాంతాల వైపు నుండి ఏ వాహనాలు (ద్విచక్ర వాహనాలు సహా) గుడికి అనుమతించబడవు.ప్రధాన రూట్ మళ్ళింపులు1. తాడేపల్లి చెక్ పోస్ట్→ బ్యారేజీ వాహనాలను కనకదుర్గ వారధి వైపు మళ్ళింపు.2. గుంటూరు, వారధి వైపు → భవానిపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వాహనాలను కనకదుర్గ ఫ్లైఓవర్ ద్వారా మళ్ళింపు.3.భవానిపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వాహనాలను గద్ద బొమ్మ, కాలేశ్వరం మార్కెట్, పంజా సెంటర్, విజీ చౌక్, చిట్టినగర్, సొరంగం మార్గంలో మళ్ళింపు.4. పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం → నగరంలోకి వచ్చే వాహనాలు గుప్తా సెంటర్, సితార జంక్షన్, సొరంగం, చిట్టినగర్, ఎర్రకట్ట, BRTS మార్గంలో మళ్ళింపు.5. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి → నగరంలోకి వాహనాలను గొల్లపూడి జంక్షన్, సితార జంక్షన్, సివిఆర్ ఫ్లైఓవర్, పైపుల్ రోడ్డు, సింగ్ నగర్ మార్గంలో మళ్ళింపు.6. విజయవాడ సిటీ → ఆర్టీసీ ఇన్ గేట్ వైపు నుండి రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, అమరావతి రాజధాని వెళ్ళే వాహనాలు కనకదుర్గ ఫ్లైఓవర్ ద్వారా భవానిపురం, గొల్లపూడి వెస్ట్ బైపాస్ లేదా కనకదుర్గ వారధి, తాడేపల్లి మార్గంలో మళ్ళింపు.పార్కింగ్ ఏర్పాట్లు హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు → బొబ్బూరి గ్రౌండ్, పున్నమి ఘాట్, భవానిపురం లారీ స్టాండ్, టీటీడీ ఖాళీ స్థలాలు, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్.గద్ద బొమ్మ → కాలేశ్వరం మార్కెట్ సెల్లార్, గాంధీ మున్సిపల్ హైస్కూల్ రోడ్.విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు → వెస్ట్ బైపాస్, సితార జంక్షన్ సమీప పార్కింగ్.గుంటూరు, అవనిగడ్డ, మచిలీపట్నం → BRTS రోడ్డు వైపు ప్రాంతాలు. భక్తులు తమ వాహనాలను పై పేర్కొన్న పార్కింగ్ ప్రదేశాలలోనే నిలిపి, పోలీసులకు సహకరించడానికి అందరు నగరవాసులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు మద్దతు ఇవ్వమని కోరబడింది.