
విజయవాడ తెలుగుతేజం ప్రతినిధి:విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు చేతుల మీదుగా శ్రీ అమ్మవారికి పోలీస్ కుటుంబములు తరఫున ప్రతి సంవత్సరము ఆనవాయితీగా తెస్తున్న చీర సారె కార్యక్రమము. దసరా సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కుటుంబములు అన్నియు గొప్ప ఊరేగింపుగా తరలివచ్చి శ్రీ అమ్మవారికి దసరా తొలి చీర సారె సమర్పణ చేసియున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసినారు . బృందం మొత్తానికి శ్రీ అమ్మవారి ప్రత్యేక పూజ మరియు వేద ఆశీర్వచనం ఏర్పాటు చేసి ఉన్నారు