నూజివీడు:
స్థానిక రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నూజివీడు క్యాంపస్‌లో విద్యార్థులకు పరుపులు, దిండ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు వీటిని అందజేశారు. నూతనంగా చేరిన ప్రథమ సంవత్సర విద్యార్థినులతో పాటు, గతంలో పరుపులు తీసుకోని రెండవ సంవత్సర విద్యార్థులకు, ఎంటెక్ (M.Tech) మొదటి సంవత్సర విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పరుపులతో పాటు దిండ్లను కూడా యాజమాన్యం అందజేసింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమానికి తాము ప్రాధాన్యతనిస్తామని, క్యాంపస్‌లో మెరుగైన వసతులు కల్పించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్యాంపస్ పరిపాలనాధికారి (AO) డాక్టర్ లక్ష్మణరావు, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ (DSW) డాక్టర్ రాజేష్, డాక్టర్ దుర్గాభవాని, చీఫ్ వార్డెన్లు బి. సురేష్ బాబు, డాక్టర్ గౌతమి తదితరులు పాల్గొన్నారు.