అమరావతి (తెలుగు తేజం ప్రతినిధి ):ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం4,08,876 దరఖాస్తులు వచ్చాయని వాటిలో1,03,494 దరఖాస్తులకు ఆమోదం లభించిందని 1,41,928 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందని తెలిపారు ఇంకా పరిశీలనలో 1,56,454 దరఖాస్తు ఉన్నాయని వాటిలో అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుందని తెలిపారు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో స్కాములు పాల్పడ్డారని నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో పిలుస్తారాలను మంజూరు చేయడంతో ఆ స్థలాలను తీసుకోవడానికి 2.65 లక్షల మంది నిరాకరించారని తెలిపారు విచారణలో ఇప్పటివరకు 43,948 లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించడం జరిగిందని దరఖాస్తు చేసిన వారిలో1,11,037 ఇళ్ల పట్టాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యతను ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.