
నందిగామ తెలుగు తేజం ప్రతినిధి :చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామం నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కరిసే మార్కురావు, రత్నకుమారి దంపతుల కుమార్తె కరిసే గ్రేసీ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభను కనబరిచింది. 2025 సంవత్సరానికి గాను నిర్వహించిన NEET నేషనల్ మెడికల్ ఎగ్జామినేషన్‌లో మెడికల్ సీటు సాధించి, గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించేందుకు అర్హత పొందింది. అయినప్పటికీ నా విద్యార్థిని వైద్య విద్యను అభ్యసించడానికి తగినంత ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య . ఎన్నారైల సహకారంతో రూ.50,000 ఆర్థిక సహాయం మరియు ఒక లాప్‌టాప్‌ను ఆదివారం నాడు గ్రేసీకి ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రేసీ మరియు ఆమె కుటుంబ సభ్యులు తంగిరాల సౌమ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.