రవీంద్ర భారతి ఆగడాలకు చిన్నారి బలి
13 ఏళ్ల బాలికను వేధించిన రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం
గత కొన్నాళ్లుగా తీవ్ర వేధింపులతో చెప్పుకోలేని వేదనతో కుమిలిపోయిన బాలిక
చివరకు రవీంద్ర భారతి స్కూల్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక
కార్పొరేట్ స్కూళ్ల పై పర్యవేక్షణ కొరవడిన విద్యాశాఖ
ప్రైవేటు ఆసుపత్రిలో బాలికకు చికిత్స
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిఐ లక్ష్మీనారాయణ
విజయవాడ (తెలుగుతేజ ప్రతినిధి)
సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్రా వారి వీధిలో రవీంద్ర భారతి స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల నాగ భరత్, కూతురు ని గత కొన్నాళ్లుగా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం తీవ్రమైన వేధింపులకు గురి చేయడంతో మనోవేదనకు గురైన బాధిత బాలిక రవీంద్ర భారతి స్కూల్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశారు.ఈ సంఘటనతో తీవ్ర గాయాల పాలైన బాధిత బాలికను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి బాధిత బాలికకుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ లక్ష్మీనారాయణ.
ఇదిలా ఉండగా కార్పొరేట్ స్కూళ్లలో ఏం జరుగుతోంది, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యం ఏం చేస్తున్నాయని ఇతర కీలకమైన అంశాలపై మరియు విద్యార్థుల పట్ల కార్పొరేట్ స్కూళ్ల అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను విద్యాశాఖ మంత్రి,విద్యాశాఖ కార్యదర్శి,ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారులు తీరుపై విమర్శలు వస్తున్నాయి, పర్యవేక్షణ లేకపోవడంతోనే కార్పొరేట్ స్కూల్లో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని విజయవాడ సత్యనారాయణ పురం నర్రా వారి వీధిలో ఉన్న రవీంద్ర భారతి స్కూల్ ఘటన స్పష్టం చేస్తుంది.
గత కొన్నాళ్లుగా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం 13 ఏళ్ల బాలికను వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురై ఎవరికి చెప్పుకోలేక పోయిందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు,
సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి, రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్య వేధింపులు బాలిక చెప్పుకోలేని అంశాలు, ఏమైనా ఉన్నాయా అనేది సైతం సత్యనారాయణపురం సిఐ లక్ష్మీనారాయణ ఆదిశగా విచారణ వేగవంతం చేశారు.
ఆసుపత్రికి వెళ్లి బాధ్యత బాలికను పరామర్శించి బాలిక కుటుంబానికి పూర్తిగా అండగా నిలిచి న్యాయం చేసేందుకు పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నర్రా వారి వీధిలో ఉన్న రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం ఇంతవరకు ఎంతమంది విద్యార్థిని,విద్యార్థుల ను గతంలో ఏమైనావేధించారా, ఇక్కడ ఏమైనా విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారా, అటువంటి సంఘటనలు బయటికి వచ్చాయా బయటకు రాకుండా వెలుగులోకి రానివి ఏమైనా ఉన్నాయా అనేది సత్యనారాయణపురం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.