రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

ఈ గవర్నెన్సు పై జాతీయ సదస్సులో పాల్గొనున్న సీఎం

విశాఖ, సెప్టెంబర్ 21:విశాఖలో జరుగనున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. “సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్” థీమ్ తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్‌ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ సదస్సు కు హాజరై ప్రసంగించనున్నారు. విశాఖలోని నోవోటెల్ హోటల్ వేదిక గా జరుగునున్న ఈ సదస్సులో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.ఈ-గవర్నెన్స్‌లో ఉత్తమ ఆవిష్కరణలు, సముద్ర గర్భ కేబుల్స్, డేటా సెంటర్లు, గ్రామీణ స్థాయిలో ఈ-గవర్నెన్స్ ఆవిష్కరణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ముగింపు కార్యక్రమంలో ‘విశాఖపట్నం డిక్లరేషన్ ఆన్ ఈ-గవర్నెన్స్ 2025’ ను కూడా ఆవిష్కరించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *